జడ్పీటీసీ, ఎంపీటీసీ మూడో ఎన్నికల పోలింగ్ ప్రారంభమై కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. మూడో విడతలో రాష్ట్రంలోని 27 జిల్లాలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా వీటిలో ఇప్పటికే 30 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవడంతో మూడో విడతలో 160 జడ్పీటీసీ, 1710 ఎంపీటీసీ స్థానాలకు అధికారులకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 160 జడ్పీటీసీ స్థానాలకు బరిలో 741 మంది అభ్యర్థులు.. 1708 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో 5,726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహణ.
తొలివిడతలో వాయిదాపడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్‌నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా అధికారులు నేడు పోలింగ్ చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 16.17 శాతం పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లాలో 19.67 శాతం, నారాయణపేటలో 19.80 శాతం, మహబూబాబాద్ జిల్లాలో 17.76 శాతం, ఆసిఫాబాద్ జిల్లాలో 16.68 శాతంగా పోలింగ్ నమోదైంది.
కొనసాగుతున్న మూడో విడత పరిషత్ ఎన్నికల పోలింగ్
Subscribe
Login
0 Comments