సినిమాలపై పవన్ క్లారిటీ..!

0
180

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో వెలుబడనున్నాయి. ఏపీలో అధికారం ఎవరిదో.. ప్రతిపక్షంలో ఎవరు కూర్చోబోతున్నారో అనేది మరో పదిరోజుల్లో తెలిసిపోతుంది. ఇప్పటికే అటు టీడీపీ.. ఇటు వైసీపీ అధికారం తమదంటే తమదంటున్నాయి. అయితే జనసేన మాత్రం అటు అధికారానికి.. ఇటు ప్రతిపక్షానికి దూరంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది.

ఇది ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఐదేళ్ళలో వరుస పెట్టి సినిమాలు చేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు మైత్రి మూవీ మేకర్స్ దగ్గర పవన్ అడ్వాన్స్ తీసుకున్నారని.. కాబట్టి ఖచ్చితంగా సినిమాలు చేస్తారని కొంతమంది వాదించారు. అయితే ఈ వాదనలన్నింటికీ నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో ఫుల్ స్టాప్ పెట్టేశారు పవన్ కళ్యాణ్.

ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన ఏపీలో చురుకైన పాత్ర పోషిస్తుందని పవన్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలే అజెండాగా దూసుకెళ్లాలని.. అధికార విపక్షాలు ఒకర్ని ఒకరు దుమ్మెత్తిపోసుకోవడంలో బిజీగా ఉంటాయి కాబట్టి.. మనం ప్రజల పక్షాన పోరాడాలని అభిమానులకు పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. దీన్ని బట్టి పవన్ కళ్యాణ్ సినిమాల కన్నా ప్రజాసేవ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న నాగబాబు కూడా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పవన్ సినిమాలు చేయకపోవచ్చని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here