టీం ఇండియా కెప్టెన్‌గా మాత్రమే కాదు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కూడా మహేంద్రసింగ్ ధోనీకి మంచి రికార్డు ఉంది. ధోనీ సారథ్యంలో 12 సీజన్లలో ఎనిమిది సీజన్లు ఫైనల్స్‌కు చేరిన చెన్నై మూడుసార్లు టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలై.. నాలుగోసారి టైటిల్‌ను సొంతం చేసుకొనే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో చెన్నై అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు.

ఈ బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో బాధకరమైన వార్త త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రపంచకప్ తర్వాత ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే నిన్నటి మ్యాచ్ అనంతరం ప్రజెంటేషన్‌లో ధోనీని తన రిటైర్‌మెంట్ గురించి అడిగారు. ”వచ్చే సీజన్‌లో ఆడుతాడా” అని ప్రశ్నించగా.. ”ఆడుతానని భావిస్తున్నాను” అని ధోనీ చెప్పాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ కూడా ”వీ లవ్‌ యూ 300 తలా” అంటూ ట్వీట్ చేసింది. దీంతో చెన్నై అభిమానుల్లో కలవరం మొదలైంది. వచ్చే సీజన్‌లో ఇక ధోనీ కనిపించడేమో అని అభిమానులు బాధపడుతున్నారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments