భారీ అంచనాలతో ప్రేక్షకులకి ముందుకు వచ్చిన మహర్షి చిత్రం అభిమానుల అంచనాలకి తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళ వర్షం కురిపిస్తుంది. మే 9న విడుదలైన మహర్షి కేవలం నాలుగు రోజులలోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేసింది. స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా మూడు పాత్రలలో మహేష్ అదరగొట్టారు. వీకెండ్ వ్యవసాయం అను కాన్సెప్ట్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రాన్ని ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించడంతో మూవీకి భారీ ఆదరణ లభిస్తుంది. అల్లరి నరేష్ కూడా మహేష్ ఫ్రెండ్ పాత్రలో అదరగొట్టేశాడు. పూజా గ్లామర్ కూడా సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.
ఏదేమైన కేవలం నాలుగు రోజులలోనే ఈ చిత్రం వందకోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. మహర్షి చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, దిల్ రాజు, అశ్విని దత్, పీవీపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.