స్కూల్ బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నాడన్న వార్తలు ఇటీవల షికార్లు చేశాయి. వీటితో మెగా ఫ్యామిలీ అయోమయంలో పడినట్టుకూడా ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి వీరాభిమాని ఒకరు శ్రీకాకుళంలో ఆయన పేరుతో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ మేరకు ఈ స్కూల్ సీఈవో శ్రీనివాస్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ స్కూల్స్‌కు, మెగా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మెగా కుటుంబం మీద ఉన్న అభిమానంతో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబులను గౌరవ ప్రదమైన హోదాల్లో తాము నియమించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments