భారత దేశాన్ని విభజించేవాడు అన్న వివాదాస్పద హైడ్ లైన్ తో అమెరికాకు చెందిన న్యూస్ మ్యాగజైన్ “టైమ్”వ్యంగ్యంగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటోను కవర్ పేజీపై ప్రచురించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . మే-20,2019న విడుదల అయ్యే ఈ మ్యాగజైన్ ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా వివాదాలు సృష్టించేదిగా ఉంది.

హిందూ ముస్లిం ల మధ్య మతపరమైన విభజన చేసే వ్యక్తిగా మోడీని ఈ ఆర్టికల్ లో అభివర్ణించారు. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా అన్న హెడ్ లైన్ తో ఈ ఆర్టికల్ ను అతిష్ తఫీర్ రాశారు.నెహ్రూ,మోడీకి మధ్య వ్యత్యాసం గురించి కూడా ఈ ఆర్టికల్ లో ఉంది.

మోడీ హయాంలో హిందూ-ముస్లిం సంబంధాలు, నెహ్రూని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం వంటి అనేక అంశాల ఆధారంగా ఈ ఆర్టికల్ రాయబడింది. ఇక ఈ ఆర్టికల్ లో మోడీని ఏకిపారేశారు .

గుజరాత్ అల్లర్లను కూడా ఈ ఆర్టికల్ లో గుర్తు చేశారు. అయితే మోడీ గురించి గతంలో కూడా టైమ్స్ మ్యాగజైన్ ఈ విధంగా వివాదాస్పదమైన కామెంట్రీ రాసింది . 2012లో మోడీని వివాదాస్పదమైన అంశాలపై ఆసక్తి చూపించే తెలివైన రాజకీయనాయకుడిగా టైమ్స్ తన మ్యాగజైన్ లో ఓ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. అప్పట్లో అదికూడా పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు కవర్ పేజీపై వ్యంగ్యంగా ఉన్న మోడీ ఫొటో పక్కన భారతదేశాన్ని విభజించేవాడు అనే హెడ్ లైన్ పెట్టి మరీ మోడీపై చాలా నెగిటివ్ ఆర్టికల్ రాసింది టైమ్స్ మ్యాగజైన్ .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments