ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ తిరిగివచ్చారు. ఈ పర్యటనలో ఆయన తొలుత కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకొన్నారు. అక్కడి నుంచి తమిళనాడు రామేశ్వరం వెళ్ళి రామనాధస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ధనుష్కోటి, రామసేతు, పంచముఖ హనుమాన్ మందిరాలను దర్శించుకొన్న తరువాత అక్కడి నుంచి మధురై వెళ్ళి మీనాక్షి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాలలో కలియతిరిగి వాటి నిర్మాణాలను, ఆలయ ప్రాశస్యతను ఆలయ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. తమిళనాడులో మహాబలిపురం, శ్రీరంగం ఆలయాలను కూడా దర్శించుకోవలసి ఉంది కానీ డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌తో సమావేశం రద్దు అవడంతో పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి ప్రత్యేకవిమానంలో హైదరాబాద్‌ తిరిగివచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments