స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంతటి విఫల ప్రధానిని తానెన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీపై విమర్శలు సంధించారు. ట్విట్టర్ వేదికగా గురువారం ఆయన మోదీ తీరుపై విరుచుకుపడ్డారు. 70 ఏళ్లలో దేశం చూసిన ప్రధానమంత్రుల్లో జవాబుదారీతనం లేని ప్రధాని మోదీయే అని విమర్శించారు. మోదీ పాలనలో దేశంలో ఎన్నడూ లేనంతగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంతఃకలహాలు రేగాయన్నారు. ఒక్క మీడియా సమావేశం కూడా పెట్టని ప్రధానిగా మోదీ తప్ప మరెవరూ లేరని ఎద్దేవా చేశారు. దేశంలో తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు ప్రజల ముందుకొచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పడాన్ని గుర్తుచేశారు. చరిత్రలో తొలిసారిగా సాక్షాత్తూ రక్షణ శాఖ కార్యాలయంలోనే దేశ భద్రతకు సంబంధించి పత్రాలు మాయమయ్యాయని తెలిపారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments