సుమను చూసి మనసు పారేసుకున్నాను

0
241

నటుడిగా రాజీవ్ కనకాల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక యాంకర్ గా ఆయన భార్య సుమ ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. సుదీర్ఘ కాలంగా ఇద్దరూ తమ హవాను కొనసాగిస్తూనే వున్నారు. తాజా ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ” సీరియల్స్ చేస్తున్నప్పుడే సుమను చూసి మనసు పారేసుకున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
నేను ఇష్టపడుతున్నాననే విషయం తను గ్రహించింది. నా మనసులోని మాటను సుమకు చెప్పేసి, మూడు నాలుగు రోజుల పాటు ఆమెకి కనిపించడం మానేశాను. ఆ తరువాత ఆమెనే కాల్ చేసి .. తన అంగీకారాన్ని తెలియజేసింది. ఆ తరువాత జరిగిన ఒక సంఘటన కారణంగా, ‘ఇప్పుడే ఇలా అంటే పెళ్లి అయిన తరువాత ఎన్ని షరతులు పెడతాడో ఏమిటో’ అని చెప్పేసి ‘నో’ అనేసింది.

దాంతో నేనే నచ్చజెప్పి మళ్లీ ప్రసన్నం చేసుకోవలసి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here