జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ఎస్పీ వైరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
ఎన్నికల అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ వై రెడ్డి హైదరాబాద్ లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
అయితే శనివారం నేరుగా ఎస్పీ వై రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు నివాళులు అర్పించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చనున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.