బాబు మళ్లీ సీఎం కావాలని టీడీపీ ఎంపీ యాగాలు

0
298

నవ్యాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆకాంక్షించారు. ఈ మేరకు మొర్జంపాడు శ్రీ బుగ్గమల్లేశ్వరస్వామి క్షేత్రంలో గురువాం శత చండీయాగం, మహాసుదర్శన యాగాలు నిర్వహించారు. చల్లా శ్రీనివాసశర్మ ఆధ్యర్యంలో పదుల సంఖ్యలో రుత్వికులు శాస్త్రోక్తంగా యాగ కృతువు నిర్వహించారు. గురువారం ప్రారంభమైన ఈ యాగం ఐదువ రోజైన పూర్ణాహుతితో సమాప్తి అవుతుందని శ్రీనివాసశర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ రాయపాటి మాట్లాడుతూ రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు హయాంలో నిర్మితమైన శ్రీ బుగ్గమల్లేశ్వర స్వామీ ఆలయం శ్రీశైల దేవస్థానంతో సమానమైన ప్రాశస్థ్యం పొందిందని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here