పూరి జగన్నాథ్ లా పుట్టాలని ఉంది.

0
252

టాలీవుడ్ లో మాస్ చిత్రాల దర్శకుల జాబితాలో వివి వినాయక్ ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి, ఎన్టీఆర్ వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు ఆయన సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఇటీవల వివి వినాయక్ కు ఖైదీ నెం 150 మినహా సరైన విజయం లేదు. అది కూడా మెగాస్టార్ రీ ఎంట్రీ, కత్తి రీమేక్ కావడంతో వినాయక్ కు పూర్తి క్రెడిట్ దక్కలేదు. ఆయన చివరగా తెరకెక్కించిన ఇంటెలిజెంట్ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
ప్రస్తుతం వివి వినాయక్ బాలయ్యతో ఓ చిత్రాన్ని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా వివి వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి, పూరి జగన్నాథ్ తో తనకు ఉన్న స్నేహం గురించి మాట్లాడారు.

ఇక పూరి జగన్నాథ్, తాను చాలా సరదాగా మాట్లాడుకుంటాం అని వినాయక్ తెలిపారు. కాస్త నిరాశగా అనిపించినప్పుడు మొదట తాను కలుసుకోవాలని భావించే వ్యక్తి పూరి జగన్నాథ్. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే.. ఫోన్ చేయగానే ముందు మీరు వచ్చేయండి మాట్లాడుకుందాం అని అంటారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా భయం, టెన్షన్ లేని వ్యక్తి పూరి అని వినాయక్ అన్నారు.

పూరిని చూసిన వారికెవరికైనా సరే అలాగే బతకాలని అనిపిస్తుంది. వచ్చే జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్ లా జన్మించాలని కోరుకుంటా అని వినాయక్ అన్నారు. గత ఏడాది విడుదలైన సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెట్ చిత్రం తర్వాత వినాయక్ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. బాలయ్య కోసం ఓ కథతో వినాయక్ సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here