తాము పెంచుకుంటున్న కుక్కపిల్ల ‘డ్యూక్‌’ అదృశ్యం కావడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. 24 గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు వీధుల్లో గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో కుక్క ఫొటోతో కూడిన పోస్టర్లను కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో అంటించి ప్రచారం చేశారు. వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి ప్రాంతంలో ఉంటున్న ప్రసాద్‌ ‘డ్యూక్‌’ అనే కుక్క పిల్లను పెంచుకుంటున్నారు. అయితే బుధవారం సదరు కుక్క అకస్మాత్తుగా అదృశ్యమైంది.

ఈ విషయాన్ని ప్రసాద్‌ రాంచీలో ఉంటున్న తన కుమార్తె సబితకు తెలియజేయడంతో ఆమె హుటాహుటిన విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంది.

రెండు రోజులుగా గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. డ్యూక్‌ ఆచూకీ తెలిపిన వారికి విలువైన బహుమతి ఇవ్వనున్నట్లు పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. డ్యూక్‌ ఆచూకీ తెలిసిన వారు 98666 94700 ఫోన్‌ నంబర్‌లో సంప్రదించాలని కోరుతున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments