ఈసీ ఎన్నికల కోడ్‌ ను కొంత సవరించాల్సిన అవసరముందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ తో ఇసి ఎపి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం చాలా దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి ఇసి ఎన్నికల కోడ్‌ ను కొంత సవరించాల్సిన అవసరముందన్నారు. దేశంలో ఎపి పట్ల ఒక ప్రత్యేక వైఖిరిని ఇసి అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో అవసరాలను బట్టి సమీక్షలు నిర్వహిస్తుంటే.. ఇసి ఎపి లో మాత్రం ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.

బాధ్యత కలిగిన వారు సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సమీక్షలు, కేబినెట్‌ను నిర్వహించే అధికారం ఉందన్నారు. సిఎం ఏర్పాటు చేసిన ఆర్‌టిజిఎస్‌ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. పక్క రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఆర్‌టిజిఎస్‌ ను అభివృద్ధి చేశామన్నారు. రంజాన్‌ తోఫా ఆగిపోతుందని వైసిపి అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి పుల్లారావు ఎద్దేవా చేశారు. వైసిపి మాటలు నమ్మి ప్రజలు పందెలు కట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. ప్రెస్‌ మీట్‌ అనంతరం.. పుష్పవతి అర్గో ప్రొడక్ట్స్‌ వారి నేచురల్‌ స్పైస్‌ ప్రొడక్ట్స్‌ ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి సాంబశివరావు, రాయపాటి రంగబాబు, తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments