సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన’మహర్షి’సినిమా కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా “అల్లరి” నరేష్ ముఖ్య పాత్ర పోషించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు.

అయితే మహేష్ అభిమానులు, ప్రేక్షకులతోపాటు అల్లరి నరేష్ కూడా ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే గత కొంతకాలంగా సోలో హీరోగా చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి.

అయితే ఎంతో కీలక పాత్రలో నటించిన కామెడీ హీరో అల్లరి నరేష్, మహేశ్ తరువాత సినిమాలోనే హైలెట్ గా నిలిచాడు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో నరేష్ నటన చాలా బాగుంది.

అంతే తప్ప తన కెరీర్‌కు ఉపయోగపడే స్థాయిలో మాత్రం ఈ సినిమాలో నరేష్ క్యారెక్టర్ లేదని థియోటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెప్పుకుంటున్నారట. ఎందుకంటే ఈ సినిమా మొత్తం మహేష్ వన్ మ్యాన్ షోలా ఉందట. ఇక సినిమా అంతటిని మహేష్ తన భుజాల మీద మోశారని అంటున్నారు. దాంతో ఈ సినిమాపై అల్లరి నరేష్ పెట్టుకున్న ఆశలన్ని ఆవిరై పోయాయని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారట.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments