*మహనీయులను ఎల్లవేళల స్మరించుకోవాలి*
*సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి*

*మే 7న జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మరియు స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా*

డోన్ :ఈరోజు స్థానిక డోన్ లో ఐ టి ఐ నందు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో డోన్ ఐ టి ఐ ప్రిన్స్ పాల్ యస్. ప్రసాద్ రెడ్డి అద్యక్షతన
జాతీయ గీతం రచయిత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మరియు స్వాతంత్ర్యసరయోధులు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘణంగా నివాళులు అర్పించారు. వారిని స్మరించుకున్నారు
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ,ఐ టి ఐ ప్రిన్స్ పాల్ యస్ .ప్రసాద్ రెడ్డి లు మాట్లాడుతూ

భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ మే7, 1861
జన్మించారు. ఈయన తన గీతాంజలి కావ్యానికి సాహిత్యంలో నోబెల్ బహుమతిని
అందుకున్నాడు. నోబెల్ బహుమతిని అందుకున్న మొట్టమొదటి ఆసియావాసి గా పేరుగాంచిన మహానుభావులు శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.రవీంద్రుడు మొదటి నుండి జాతీయ భావాలున్నవాడు. దేశభక్తి గీతాలను పాడాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ వ్రాసిన “జనగణమణ” ను జాతీయ గీతంగా ప్రకటించారు.
రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా ,గొప్ప మానవతావేత్తగా ఠాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న విశ్వకవి’ రవీంద్రనాథ్ ఠాగూర్, 1941 ఆగష్టు 7న మరణించాడు.
భారత స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897 జన్మించారు.
ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్ర్యం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు.ఆదివాసులతో కలిసి బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీ కొట్టాడు.
కేవలం 27 ఏళ్ళ వయసులోనే 1924 మే 7 అల్లూరి సీతారామరాజు
అమరవీరుడయ్యాడు.
శ్రీ సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదు
రా తమ్ముడూ! వీరుడు మరణింపడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలము ప్రవహిస్తూ ఉంటుందని మన్యం వీరులు బ్రిటిష్ వారి పై యుద్దం కొనసాగించారు
ఇలాంటి మహనీయులైన స్వాతంత్ర సమరయోధులను ఎల్లవేళల స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్తలు డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.ఈ కార్యక్రమంలో దోరపల్లె మద్దయ్య , ట్రైనింగ్ అఫీసర్ సి .శేఖర్ రెడ్డి ,జి .ప్రసాద్ ,బి.
శ్రీదర్ .విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments