టీవీ9 సీఈవో పదవి నుంచి తనను తప్పించారన్న ప్రచారాన్ని రవిప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. టీవీ9 స్టూడియోలో ప్రత్యక్షమైన ఆయన..తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరూ అరెస్ట్ చేయడం లేదని స్పష్టంచేశారు. NCLT కేసు కోర్టులో ఉందని..మే 16 విచారణ జరగుతుందని ఆయన చెప్పారు. దాని ఆధారంగా తనపై తప్పుడు కేసులు బనాయించేందుకు కొందరు కుట్రలు చేశారని..అవన్నీ నిలబడబోవని తేల్చిచెప్పారు. సామాజిక సేవ కోసం టీవీ9 జర్నలిస్టులు పనిచేస్తున్నారన్న రవిప్రకాశ్…పుకార్లను నమ్మవద్దని సూచించారు.
Subscribe
Login
0 Comments