తెలుగు సినీ ప్రేక్షకుల్లో అత్యధిక క్రేజ్ గల యువ హీరో విజయ్ దేవరకొండ అనడంలో అతిశయోక్తి లేదు . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత వరుస విజయాలతో దూసుకుపోతున్నారు విజయ్ . ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్ . భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు . గీత గోవిందం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు రష్మిక. ఈ చిత్రంలో కూడా విజయ్, రష్మిక జత కట్టడంతో చిత్రం పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి . ఇప్పటికే ఒక పాట విడుదలై అందరి మన్ననలను పొందింది . అయితే ఈ చిత్రం విడుదల తేదీ ని చిత్ర యూనిట్ ప్రకటించింది . ఈ చిత్రం జూలై 26 ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ విషయాన్ని విజయ్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . గీత గోవిందంతో హిట్ కొట్టిన ఈ జంట డియర్ కామ్రేడ్ ద్వారా మరో విజయాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు …

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments