వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథలోని ముఖ్య భాగాలతో తెరకెక్కిన సినిమా యాత్ర. ఆయన చేసిన పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా వచ్చింది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ చిల్లా, శషి దేవి రెడ్డి నిర్మించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం..

కథ :

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ కాబట్టి ఇందులో కల్పితాలకు తావు లేవు. అయితే వైఎస్ తన పార్టీ అభివృద్ధి కోసం జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఆ రకంగా పాదయాత్ర మొదలు పెడతాడు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలకు రాజశేఖర్ రెడ్డి మనసు కదిలిపోతుంది. నాయకులుగా ఇన్నాళ్లు మనం ఏం చేస్తున్నాం అనేలా తనకు తానే ప్రశ్న వేసుకుంటాడు. అలా జనాల్లో తిరిగి మహానేతగా ఎలా మారాడు అన్న పాయింట్ తో యాత్ర తీశారు.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మళయాళ స్టార్ అయిన మమ్ముట్టి వైఎస్ గా బాగా కుదిరారు. అభినయం కూడా ఆకట్టుకుంది. సినిమాలో మిగతా కాస్టింగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అనసూయ, భద్రం, సుహాసిని, రావు రమేష్, జగపతి బాబు ఇలా అందరు బాగానే చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

సత్య సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో చాలా క్రౌడ్ కనిపిస్తుంది.. అయినా సరే క్లం సీగా అనిపించకండా చేశారు. కె మ్యూజిక్ ఆకట్టుకుంది. అన్ని పాటలు బాగున్నాయి. సిరివెన్నెల సాహిత్యంతో పాటుగా పెంచల్ దాస్ రాసిన మరుగైనావ రాజన్న సాంగ్ హృదయాన్ని కదిలించి వేస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు తెలిసిన కథను మనసులను కదిలించేలా డైరెక్ట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :

బయోపిక్ అనగానే అంచనాలు ఉంటాయి. వైఎస్ బయోపిక్ మీద కూడా అలానే ఉన్నాయి. అయితే ఆ అంచనాలను సినిమా అందుకుందని చెప్పొచ్చు. పొలిటికల్ మూవీ కదా ఒక పార్టీని విమర్శించేలా కాకుండా కేవలం వ్యక్తి ఆలోచనలు.. వాటి ప్రభావాలు సినిమాలో చూపించారు. నిజంగా రాజశేఖర్ రెడ్డి ఆలోచన గొప్పదిగా చూపించారు.

ఇక పతాక సన్నివేశాల్లో ఆయన ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించిన రియల్ ఫీడ్ వాడారు. ఆ టైంలో అందరికి మనసు కదిలించేలా పాట రాశారు పెంచల్ దాస్. వైఎస్ అభిమానులకు యాత్ర మంచి కానుక. సినిమా ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అయితే మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అక్కడక్కడ ల్యాగ్ అవడం వల్ల సినిమా ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

మమ్ముట్టి నటన

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్

అక్కడక్కడ ల్యాగ్ అవడం

బాటం లైన్ :

వైఎస్ యాత్ర.. గొప్ప నివాళి..!

రేటింగ్ : 2.75/5

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments