• ఎడి అంటే ఆఫ్టర్‌ డైనాస్టీ
  • కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తిన ప్రధానిమోడీ

    కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ నిరంతరం విమర్శలుచేయడాన్ని లోక్‌సభలో గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ తూర్పారబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ వారసత్వంపై ధ్వజమెత్తారు. రెండుదశల చరిత్ర భారత్‌లో ఉందని, బిసి, ఎడి అని 1947 సంవత్సరం తర్వాత చూస్తే కాంగ్రెస్‌ పార్టీ పరంగాచూస్తే బిసి అంటే కాంగ్రెస్‌కు ముందు, ఎడి అంటే వంశపారంపర్యపాలనకు తర్వాత (ఎడి) అని అర్ధంచేసుకోవాల్సి ఉందని ఎద్దేవాచేసారు. 55ఏళ్లలో చేయలేని పాలనను తాము ఐదేళ్లలోనే పూర్తిచేశామని అన్నారు. వివిధ ప్రభుత్వశాఖల పనితీరు ప్రామాణిక సూచీలనుసైతం ఇందుకు పరిగణనలోనికి తీసుకోవాలన ఇఅనఆనరు. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ మోడీప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను నిర్వీర్యంచేస్తోందని, దర్యాప్తుసంస్థలను ప్రత్యర్ధులపైకి ఉసిగొలుపుతోందని, గణాంకాలను మభ్యపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదన్న వ్యాఖ్యలపై మోడీ తీవ్రంగా స్పందించారు. మోడీ కాంగ్రెస్‌పై తిరిగి ధనుమాడుతూ మోడీ సంస్థలను ధ్వంసంచేస్తున్నారని చెపుతున్నారని, అయితే బయట ప్రజలు చౌకీదారును దొంగలే దూషిస్తారని చెపుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అత్యవసరపరిస్థితిని విధించిందని, సైన్యాన్ని అవమానించిందని, సైన్యాధిపతిని గూండాగా పేర్కొన్నదని విమర్శించారు.

    స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి మంచి అయినా చెడు అయినా బలహీన ప్రభుత్వం లేదా బలహీన ప్రధాని, మెజార్టీ ప్రభుత్వం లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏదైనా సైన్యాన్ని ఈ విధంగా అవమానించలేదని విమర్శల దాడిచేయలేదని పేర్కొన్నారు. రాజకీయాలకోసం కాంగ్రెస పార్టీ ఇపుడు ఆపనిచేస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యలకే మన సైన్యం అవమానంగా భావించిందని, ఎంతో తప్పిదమని పేర్కొన్నారు. అలాగే కేంద్రెన్నికల సంఘాన్ని కూడా నిరంతరం విరామంలేకుండా విమర్శిస్తున్నారని, చివరకు న్యాయవ్యవస్థనుసైతం బెదిరించే స్థాయికి దిగారని పేర్కొన్నారు.

    కాంగ్రెస్‌ పార్టీప్రణాళికా సంఘాన్ని ఒక జోకర్ల బృందంగా విశ్లేషించిందని, మీ మాజీ ప్రధాన మంత్రి ఈ జోకర్ల బృందాన్ని, అదే ప్రనాళికా సంఘాన్ని విమర్శించారని, ఇపుడు మీరు కొత్తగా ప్రభుత్వ సంస్థలను ధ్వంసంచేస్తున్నట్లు మాపై విమర్శిస్తున్నారని మోడీ పేర్కొన్నారు. నిరంతరం మాపై విమర్శించడమే ప్రధాన ప్రతిపక్షానికి అదేపనిగా ఉందని, ఇపుడు దేశాన్నే విమర్శిస్తున్నారని మేం ఆపనిచేయలేమని ప్రధానిమోడీపేర్కొన్నారు. లండన్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంపై ప్రధాని మోడీపరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీని మరోసారి ధనుమాడారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments