అన్ని చిత్ర పరిశ్రమలకు పైరసీ అనేది పెను ప్రమాదం గా మారిన సంగతి తెలిసిందే. ఎంత పెద్ద సినిమానైనా సరే విడుదలైన మొదటి రోజే పైరసీ చేసి నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకొస్తున్నారు. దీంతో చిత్ర నిర్మాతలు ఎలాంటి చర్యలు తీసుకున్న పైరసీ రాయుళ్లు మాత్రం తమ ఆగడాలను ఆపడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం సినిమాటోగ్రఫీ 1952 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.

దీని ద్వారా సరైన అనుమతులు లేకుండా పైరసీ చర్యలకు పాల్పడిన వ్యక్తులు మూడేళ్ల కారాగార శిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా కట్టాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆ రెండిటికీ శిక్షార్హులవుతారు. కేంద్రం తెలిపిన ఈ చట్టం పట్ల సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో దీని గురించి ప్రచారం చేస్తున్నారు. ”మన దేశంలోని మేధావుల సంపత్తిని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన ముందడుగు” అని చెపుతున్నారు. మరి ఇప్పుడైనా పైరసీ అరికడుతుందో లేదో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments