మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు పలు అంశాలు చర్చకు రానున్నాయి. శాసనసభలో బీసీ ఉప ప్రణాళిక అంశంపై ప్రశ్నోత్తరాల్లో చర్చించనున్నారు. అలాగే నీరు-చెట్టు పథకానికి నిధుల కేటాయింపుపై , ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, ఏపీపీఎస్సీ ఖాళీల నోటిఫైలో జాప్యంపై, అమరావతిలో వ్యవసాయ కార్మికులకు ఉపాధి అవకాశాలపై, తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల అంశంపై, నరేగా కింద కేంద్ర ప్రభుత్వ నిధుల మంజూరు అంశంపై చర్చించనున్నారు. జాతీయ రహదారిపై 216 విస్తరణ పనులపై, రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించనున్నారు. శాసనసభలో నేడు 4 బిల్లులపై చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. సంక్షేమం, మానవవనరుల అభివృద్ధిపై అసెంబ్లిలో లఘు చర్చ జరగనుంది. పోలవరం, నదుల అనుసంధానం, జలవనరుల ప్రాజెక్టుల నిర్మాణంపై కడా లఘు చర్చ జరగనుంది. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బట్జెట్‌పై శాసనసభలో చర్చ జరగనుంది.

శాసన మండలిలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. బెల్లానికి కనీస మద్దతు ధర అంశంపై, కౌలు రైతులకు రుణాలు, మామిడి బోర్డు, వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌పై శాసన మండలిలో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు, ఎస్సీ, ఎస్టీలకు భూమి కేటాయింపుపై, ఒప్పంద ఉద్యోగులకు ప్రయోజనాలు, అంగన్‌వాడీ కేంద్రాలపై కమిటీపై, బాలయోగి ఆశ్రమ పాఠశాలలు, తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. శాసన మండలిలో ఈరోజు 12 బిల్లులపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. అలాగే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై మండలిలో చర్చించనున్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై సీఎం చంద్రబాబు మండలిలో ప్రకటన చేయనున్నారు. సంక్షేమ రంగంపై మండలిలో లఘు చర్చను కొనసాగించనున్నారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై కూడా శాసన మండలిలో చర్చించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments