హీరో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోన్నునారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఆదిశేషగిరిరావు చేరికను ఘనంగా జరిపించేందుకు టీడీపీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అనేక ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా, ఒకే సామాజిక వర్గమైనా, దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్న నందమూరి, ఘట్టమనేని అభిమానులు ఒకే రాజకీయ వేదికపైకి వస్తుండటంతో ఇరు కుటుంబాల అభిమానుల్లో ఆనందోత్సాహాలు మిన్నంటుతున్నాయి. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన తరువాత, కాంగ్రెస్ లో చేరిన కృష్ణ, ఎంపీగా పోటీచేసి గెలిచి, కొంతకాలం రాజకీయాల్లో రాణించారన్న సంగతి తెలిసిందే.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments