నగరంలోని హుస్సేన్‌సాగర్‌ చుట్టూ సరికొత్త అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. లక్నవరం తరహాలో హుస్సేన్‌సాగర్‌ అందాలను నీటిపై నుంచి నడుచుకుంటూ వీక్షించేందుకు వీలుగా బోర్డు వాక్‌, పాదాచారుల వంతెన ఏర్పాటు కానున్నాయి. ఆమోఘం రెస్టారెంట్‌ నుంచి బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు మీదుగా సాగర్‌ పార్క్‌ వైపు బోర్డు వాక్‌ నిర్మాణం జరగనున్నది. హుస్సేన్‌సాగర్‌ సుందరీకరణ, నిర్వహణలో భాగంగా సరికొత్త హంగులను సమకూర్చుతూ రూ. 38 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డు వాక్‌, పాదాచారుల వంతెనతో పాటు లోయల్‌ ట్యాంక్‌ బండ్‌ను ట్యాంక్‌బండ్‌ పైకి వచ్చేందుకు వీలుగా ఆర్ట్‌ బాక్స్‌, బస్టాప్‌లు, కబుతర్‌ఖానా, ఆర్ట్‌ గ్యాలరీలు, శిల్పాలు, పీఫుల్‌ప్లాజా, బడేమియా ఫడ్‌ కోర్టు, గ్రీన్‌ సైడ్‌, క్లంబిగ్‌ వా ల్‌, ఔట్‌ డోర్‌ జిమ్‌లు నూతనంగా రానున్నాయి. ఈ మేరకు ఈ పనులకు ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నారు. హుస్సేన్‌సాగర్‌ను సం దర్శించే పర్యాటకులకు ఈ కొత్త అందాలు మరింత కనువిందు చేయనున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments