బీజేపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ప్రచారపర్వాన్ని ఉదృతం చేసి, ఇదే సమయంలో ప్రజలను తమవైపు తిప్పుకోడానికి ప్రణాళికలు వేసింది. దానిలో భాగంగా నిన్న అమిత్ షా ఏపీలో పర్యటించగా; నేడు తెలంగాణ కు నితీష్ గడ్కరీ విచ్చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ నేడు హైదరాబాద్ నగరానికి విచ్చేయనున్నారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహించే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ శక్తికేంద్ర ఇన్‌చార్జీలు, ఆపై స్థాయి నేతలకు నిర్వహించే సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావు, జి.కిషన్‌రెడ్డి సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొంటారని నగర బీజేపీ కార్యదర్శి సి. మల్లారెడ్డి తెలిపారు. ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు ఆపైస్థాయి కార్యకర్తలంతా హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments