రాయదుర్గం పోలీస్టేషన్‌ పరిధిలో మైహోమ్‌ అబ్రా ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ఆ ప్రాంతంలో ఆంక్షలను విధిస్తున్నట్టు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. సోమవారం నుంచి మొదలయ్యే ఈ ఆంక్షలు 10 రోజుల పాటు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.

  • రోడ్‌ నెంబర్‌ 45 నుంచి రాంకీ టవర్స్‌ వైపునకు వెళ్లేవారు నోవార్టిస్‌ ప్రాంతంలో ఉన్న ఫ్లైఓవర్‌ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.
  • రోడ్‌ నెంబర్‌ 45 నుంచి బయోడైవర్సిటీ వైపునకు వెళ్లేవాహ నదారులు మైహోమ్‌ అబ్రా నుంచి సింక్రోని బిల్టింగ్‌ నుంచి సాఫ్ట్‌సోల్‌, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ గుండా వెళ్లాలి.
  • రోడ్‌ నెంబర్‌ 45 నుంచి బయోడైవర్సిటీ వెళ్లే వాహనదారులు మైహోమ్‌ అబ్రా నుంచి సింక్రోని బిల్టింగ్‌, ఐటీహబ్‌ ఫేజ్‌ 2, మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
  • రహేజా మైండ్‌ స్పేస్‌ వైపు నుంచి సైబర్‌టవర్స్‌ వెళ్లేవాహనదారులు సైయింట్‌ సీ గేట్‌ నుంచి సాఫ్ట్‌సోల్‌, మైండ్‌ స్పేస్‌ రోటరీ నుంచి వెళ్లాల్సి ఉంటుంది.
  • రహేజా మైండ్‌ స్పేస్‌ వైపునుంచి బయోడైవర్శిటీ వైపునకు వెళ్లే వాహనదారులు సైయింట్‌ బిల్డింగ్‌ నుంచి అండర్‌ ఫ్లైఓవర్‌, సాఫ్ట్‌సోల్‌ నుంచి మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్టేషన్‌ మీదుగా బయోడైవర్సిటీ చేరుకోవాలి.

ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు రద్దీని బట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments