వైసీపీ సైకో పార్టీగా మారిందని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. సోమవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పరిశ్రమలను అడ్డుకుంటూ పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే, అభివృద్ధికి అడ్డుపడటమే వైసీపీ సైకో ధోరణన్నారు. పించన్ల సభలు భగ్నం చేయడం సైకో పోకడ అని వ్యాఖ్యానించారు. పసుపు-కుంకుమ భగ్నం చేయడం జగన్ శాడిజమన్నారు. ఓట్ల తొలగింపు పేరుతో ఢిల్లీలో జగన్నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసమే వైసీపీ ఫిర్యాదులు చేస్తోందన్నారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అవగాహన పెంచాలని నేతలకు ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారం చేయాలని చంద్రబాబు సూచనలు చేశారు.