రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, ఇతర అవకతవకలపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.

పార్టీకి చెందిన మాజీ ఎంపీలు, ముఖ్య నేతలతో కలిసి ఆయన బయల్దేరుతున్నారు. సోమవారం ఉదయం 11.30గంటలకు వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలను కలుపుకుని చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)ను కలుస్తారు. ఓటర్ల జాబితాలో పెద్దఎత్తున చోటుచేసుకున్న అవకతవకలు, అక్రమంగా పేర్ల తొలగింపు అంశాలతోపాటు రాష్ట్ర డీజీపీ వ్యవహారశైలిపైనా సీఈసీకి ఫిర్యాదు చేస్తారని సమాచారం.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments