న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ 43 ఓవర్లకి గాను 190 పరుగులు చేసింది. ఒకానొక దశలో నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ని అంబటి రాయుడు ( 90; 113 బంతుల్లో, 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), విజయ్ శంకర్ ( 45; 64 బంతుల్లో, 4 ఫోర్స్) ఆదుకున్నారు. బౌల్ట్‌, హెన్రీలు నిప్పులు చెరిగే బంతులు విసరడంతో రోహిత్ శర్మ (16 బంతుల్లో 2) , శిఖర్ ధావన్ (13 బంతుల్లో 6, 1 ఫోర్) , శుభమన్ గిల్ (11 బంతుల్లో 7 ; 1 ఫోర్‌), ధోని ( 6 బంతుల్లో 1 ) త్వరగా పెవిలియన్‌కి చేరారు. ముఖ్యంగా తొలి బంతి నుండి చాలా ఓపికగా ఆడుతూ వచ్చిన అంబటి రాయుడు కెరీర్‌లో పదో అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో కేదార్ జాదవ్( 36 బంతుల్లో 25; 1 ఫోర్ ) తో పాండ్యా ఉన్నారు. కివీస్ బౌలర్స్‌లో హెన్రీ మూడు వికెట్స్ తీయగా, బౌల్ట్ రెండు వికెట్స్ తీసాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments