బుధవారం స్థిరంగా ఉన్న ఇంధన ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధరపై 1 పైసా.. లీటర్ డీజిల్ ధర 8 పైసలు తగ్గింది. తగ్గిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.09 వద్ద.. డీజిల్ ధర రూ.65.81 వద్ద కొనసాగుతున్నాయి. ముంబయిలో పెట్రోలు ధర రూ.76.72 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.68.91 వద్ద ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.75.42 లుగా.. డీజిల్ ధర రూ.71.54 లుగా ఉంది. ఇక అమరావతిలో పెట్రోల్ రూ.75.19 వద్ద, డీజిల్ రూ.70.93 వద్ద కొనసాగుతున్నాయి.