ఏపీ సిఎం చంద్రబాబు రారమ్మని పిలుస్తన్నప్పటికీ మొండిగా నిలబడ్డ జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎక్కడిదక్కడ ఎలా ప్రవర్తించాలో అన్నదానికి నిదర్శనం గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తే అర్ధమౌతుంది. మొన్న తటస్థ వ్యక్తిగా వున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. రాజకీయాలకి అతీతంగా పెట్టిన సమావేశం ఇది. ఈ సమావేశానికి హాజరయ్యారు పవన్ కళ్యాణ్. అయితే రాజకీయ ఉద్దేశంతో చంద్రబాబు పెట్టిన సమావేశానికి మాత్రం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సమావేశానికి రానని తేల్చి చెప్పారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. ఈ సమావేశంలో చిత్త శుద్ధిలేదని తేల్చారు.

నిజమే చంద్రబాబుకి చిత్తశుద్ధి ఎక్కడుంది? ‘స్పెషల్ స్టేటస్ తో రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుంది? స్పెషల్ స్టేటస్ ఏమీ సంజీవిని కాదు. స్పెషల్ స్టేటస్ వున్న ఈశాన్య రాష్ట్రాలు ఏ అభివృద్దిని సాధించాయి?” అని అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు చంద్రబాబు. స్పెషల్ ప్యాకేజీనే బెస్ట్ అని చెప్పి.. స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిన మోడీ సర్కార్ కి థ్యాంక్స్ చెబుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు చంద్రబాబు. ఇప్పుడు తన స్టాండ్ మార్చుకొని మళ్ళీ ‘ప్రత్యేక’ రాగం అందుకున్నారు. అంతేకాదు.. తన తీసుకున్న స్టాండ్ విషయంలో మిగతా పార్టీలని కూడా ఇరకాటంలో పెట్టడానికి, రాజకీయ ఉద్దేశాలతో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం అది. అందుకే అన్ని పార్టీలు ఒకటే స్టాండ్ తీసుకొని గైర్హాజరయ్యాయనేది నిర్విదాంశం. ఇలాంటి నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ‘నేను రాను’ అని చెబుతూ రాసిన లేఖ నిర్మాణాత్మక రాజకీయానికి సాక్ష్యంగా నిలిచింది.

ముందురోజు రాజకీయాలకు అతీతంగా తటస్థ వ్యక్తి ఉండవల్లి అధ్యక్షతన జరిగిన సమవేశానికి హాజరుకావడం, తర్వాత రోజు చంద్రబాబు రాజకీయ ఉద్దేశంతో పెట్టిన సమావేశానికి రానని తేల్చి చెప్పడంతో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో పాటు ఆచరణలో అమలు చేయడం ద్వారా రాజకీయాల్లో భాధ్యతయుత సాంప్రదాయాన్ని కొనసాగించారు జనసేనాని.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రింది వీడియో ని క్లిక్ చెయ్యండి.

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments