పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్నాయి… ఫిబ్రవరి 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. దేశంలోని పరిస్థితులను, పాలనా వ్యవహారాలపై ఆయన ప్రసంగిస్తారు. మరోవైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లడంతో పియూష్ గోయల్ ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సార్వత్రిక ఎన్నికల ముందు ఇదే చివరి బడ్జెట్ అవుతుంది. ఇక ఇవే చివరి సమావేశాలు. మరోవైపు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని పార్టీల నేతలను కోరారు. బుధవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో సుమిత్రా మహాజన్ నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభా నిర్వహణకు సహకరించాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను కోరారు స్పీకర్. ఇక నేడు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యఅఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నేతలను కోరనున్నారు.
అంతేకాకుండా ఆయా పార్టీల అభిప్రాయాలు తీసుకోనున్నారు.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
Subscribe
Login
0 Comments