తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి 14న విశాఖకు రానున్నారు. శారదాపీఠం వార్షికోత్సవానికి హాజరవుతారు. 14న జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో కెసిఆర్ దంపతులు హాజరవుతారు. శారదీపీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆహ్వానం మేరకు కెసిఆర్ మరోసారి విశాఖకు వస్తున్నట్లు తెలిసింది. కెసిఆర్ రెండోసారి సిఎం పదవి చేపట్టిన తర్వాత విశాఖ వచ్చి స్వరూపానంద స్వామిని దర్శించుకుని పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఎర్రవల్లిలో కెసిఆర్ ఐదురోజుల పాటు నిర్వహించిన సహస్ర చండీ యాగానికి స్వరూపానంద స్వామి హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి14న విశాఖకు కెసిఆర్
Subscribe
Login
0 Comments