గురువారం అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఢిల్లీలో ధర్మపోరాటానికి అందరూ సిద్ధం కావాలన్నారు. ఢిల్లీ దీక్షకు ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో ఆందోళనలు, ర్యాలీలు జరపాలన్నారు. ఈ ర్యాలీలో మహిళలు, రైతులు, పెన్షనర్లు టీడీపీకి అదనపు బలం అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లాంటి నగరం నిర్మించడానికి 20ఏళ్లు పడుతుంది. అందుకు కావాల్సిన నిధులు కావాలని విభజనకు ముందే డిమాండ్ చేశాం. ఇవ్వాల్సింది ఇవ్వకుండా బీజేపీ మనపై దాడులు చేస్తోందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.

వైసీపీతో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అటు కేసీఆర్, ఇటు జగన్ ఏపీకి నష్టం చేస్తున్నారు. మూడు పార్టీలు లాలూచి పడి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్నాయి. ప్రధాని మోడీ చేతకానితనం ప్రజలకు శాపం అయ్యింది. అన్నాహజారే మళ్లీ దీక్ష చేసే దుస్థితి వచ్చిందన్నారు.

లోక్ పాల్ ను నియమిస్తామని చెప్పి మోడీ మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ నే కాదు అన్నాహజారేను బీజేపీ మోసం చేసింది. సీబీఐ, ఆర్బిఐ స్వయంప్రతిపత్తిని దెబ్బతీశారు. ఇప్పుడు గణాంకాల కమిషన్ కు, సెబికి తూట్లు పొడిచారన్నారు.

అన్ని వ్యవస్థలు కుంటుపడేలా ప్రధాని మోడీ నిర్వాకాలు ఉన్నాయి. అయినా మోడీని నిగ్గదీసే ధైర్యం జగన్ కు లేదని సీఎం అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments