దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షలు అయిదు రోజులపాటు జరగనుండగా మొదటి రోజు ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పేపర్‌-2 ఉంటుంది. గణితం, ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ఆన్‌లైన్‌(కంప్యూటర్‌)లో నిర్వహిస్తారు. డ్రాయింగ్‌కు మాత్రం రాత(ఆఫ్‌లైన్‌) పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 20 వేల మంది హాజరుకావొచ్చని అంచనా.

పేపర్‌-2ను ఉదయం మాత్రమే నిర్వహిస్తారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతుంది. 8.30 గంటల తర్వాత అనుమతించరు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతోపాటు ఆధునిక ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా అక్రమాలకు పాల్పడకుండా జామర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

రేపటి నుంచి 4 రోజులపాటు పేపర్‌-1 పరీక్షలు
బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 రాయాల్సి ఉండగా ఈ నెల 9వ తేదీ నుంచి 12 వరకు నాలుగు రోజులపాటు.. రోజుకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు సుమారు 9.50 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.50 లక్షల మంది హాజరవుతారు. పేపర్‌-1 ఉదయం 9.30-12.30 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 2.30-5.30 గంటల వరకు రెండు దఫాలు నిర్వహిస్తారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments