దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో బాలకృష్ణ నటించి నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్‌. రెండు పార్టులుగా విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ కథానాయకుడు పేరుతో జనవరి 9న విడుదల కానుండగా, రెండో పార్ట్ మహానాయకుడు పేరుతో ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, సాంగ్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. యమగోల చిత్రంలో చిలక కొట్టుడు కొడితే చిన్నదానా.. సాంగ్ ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో వాడుతున్నారు. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, జయప్రదగా హన్సిక ఆ సాంగ్‌కి స్టెప్పులేయనున్నారు. తాజాగా పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ అభిమానులని ఆకట్టుకుంటుంది.

చిత్రంలో బసవతారకం పాత్రంలో విద్యాబాలన్ నటిస్తుంది. నారా చంద్రబాబు నాయుడుగా రానా, హరికృష్ణగా కల్యాణ్‌రామ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్‌ రాజ్‌పుత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సావిత్రిగా నిత్యా మేనన్‌, ప్రభగా శ్రియ కనిపించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments