బాలల హక్కుల సంఘం, ఎమెన్ ప్రొటెక్షన్ సెల్ పోలీస్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన పరివర్తన సంస్థ సాంకేతిక సహకారంతో 18 నుంచి 23 ఏండ్ల యువతులకు లఘు చిత్రాలపై పోటీలు నిర్వహిస్తూ నాలుగు అంశాల్లో ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఒకటి నుంచి 3 నిమిషాల వ్యవధి గల చిత్రాలను తీయాలని సంఘం ప్రెసిడెంట్ అనురాధరావు ఒక ప్రకటనలో తెలిపారు. మీటూ రెండు గృహ హింస, మోసపోవద్దు, విద్యార్థి మనస్తత్వం అనే ఏదైనా అంశంపై హెచ్‌డీ సెల్‌ఫోన్‌లో కానీ, హ్యాండీక్యామ్‌తో చిత్రీకరించి బాలల హక్కుల సంఘానికి అందజేస్తే ఈ నెల 24, 27వ తేదీల్లో దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబిసెంట్ ఉమెన్స్ కాలేజ్‌లో జరిగే స్క్రీనింగ్ అవార్డుల ఉత్సవంలో ఒక్కో కేటగిరిలో మూడు అవార్డులు అందజేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 98663 42424, 040-23227124లలో సంప్రదించవచ్చన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments