ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. ఆ రోజు కర్నూలు జిల్లాలో జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదే రోజు రాత్రి తిరిగి విజయవాడకు చేరుకుంటారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై సీబీఐ కేసు నమోదు చేయడం, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై చట్టబద్ధ సంస్థలతో దాడులు చేయిస్తుండటం తదితర అంశాలపైన చంద్రబాబు పలువురు ప్రతిపక్ష నేతలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెదేపా ఎంపీలతోనూ సమావేశమవుతారని వెల్లడించాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments