ప్రముఖ యాడ్ ఫిలిం మేకర్ యమునా కిషోర్ ఇటీవల tajavarthalu.in కు చెందిన బాబాయ్ మీడియా యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో భాగంగా అతిలోక సుందరి శ్రీదేవి గురుంచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు . ఆయన మాట్లాడుతూ శ్రీదేవి గారితో పనిచేసిన ఏకైక తెలుగు యాడ్ ఫిలిం మేకర్ తానేనని అన్నారు . ఈ సందర్భంగా ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు, సాధారణంగా శ్రీదేవి కి సంబందించిన వ్యవహారాలన్నీ ఆమె భర్త బోనీ కపూర్ చూసుకునేవారని , ఒక రోజు తాను సిగ్నల్స్ సరిగ్గా అందుబాటులో లేని ప్రాంతంలో ఉండగా స్వయంగా శ్రీదేవి తనకు కాల్ చేసినప్పటికీ తాను మొదట గుర్తించలేకపోయానని , తరువాత ఆమె గొంతును బట్టి గుర్తుంచి ఆమెను క్షమాపణలు కోరినట్టు యమునా కిషోర్ తెలిపారు . దేశం మొత్తానికి ఆమె సూపర్ స్టార్ అయినప్పటికీ శ్రీదేవి ఎంతో వినయంగా , అందరినీ ఆదరిస్తూ ఉండేవారని అన్నారు . ఇంకా మాట్లాడుతూ శ్రీదేవి తన సొంత బెంజ్ కారును తీసుకోమన్నారని , కానీ తనకు ఫ్రీగా వద్దని కొంత మొత్తం చెల్లించి ఆ కారును తీసుకున్నట్టు యమునా కిషోర్ తెలిపారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments