రేణు దేశాయ్ తన పుస్తకం ‘ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌’ ను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ‘జనసేన’ పై చేసిన కామెంట్స్ పై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాల పై స్పందించిన రేణు తాను రాజకీయాలను బాగా ఫాలో అవుతానని చెపుతూ అయితే ఆవిషయాల గురించి తాను బయట మాట్లాడనని కామెంట్స్ చేసింది.

దీనికి కారణం తాను రాజకీయాల పై మాట్లాడితే విపరీతమైన రచ్చ జరుగుతుంది అంటూ జోక్ చేసింది. అదేవిధంగా ఈమధ్య జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుస్తుందని తాను ముందే ఊహించాను అంటూ తన అంచనాలను వ్యక్త పరిచింది. ఇదే సందర్భంలో ఈ సంవత్సరం జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్న విషయమై తనకు అవగాహన ఉన్నా తాను తన అంచనాలను బయట పెట్టాను అని అంటోంది రేణు దేశాయ్.

ఇక్కడ అందరికీ ఊహించని ట్విస్ట్ ఇస్తూ తాను ‘జనసేన’ కుటుంబంలో భాగం అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ సమాజం కోసం నిజాయితీతో పనిచేస్తున్న నిబద్ధత తనకు బాగా ఇష్టం అంటూ ఏకంగా పవన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. అంతేకాదు తాను పవన్ విడిపోయినా తమ పిల్లల గురించి తరుచూ మాట్లాడుకుంటూనే ఉంటాము అంటూ తన పిల్లలకు తండ్రిగా మాత్రమే పవన్ కళ్యాణ్ ను గుర్తిస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

దీనితో రేణు ‘జనసేన’ పై చేసిన కామెంట్స్ జనసైనికులకు ఆశ్చర్యంతో పాటు ఆగ్రహాన్ని కూడ తెప్పిస్తున్నాయి. ‘జనసేన’ తన కుటుంబంలో ఒక భాగం అంటూ ఈమె చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో పవన్ అభిమానుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు అంతా రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ తరపున ప్రచారం చేయడానికి తమ సంసిద్ధత వ్యక్త పరిచిన నేపధ్యంలో ఇప్పుడు ఈలిస్టులో పవన్ మాజీ భార్య రేణు కూడా చేరిపోవడం పవన్ అభిమానులకు ఊహించని షాక్ అనుకోవాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here