ఒకే ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్

0
294

ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలుస్తూ ఉండే వర్మ ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రానికి సంబంధించి వెన్ను పోటు అనే సాంగ్‌ని విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక రీసెంట్‌గా చెర్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వినయ విధేయ రామ చిత్ర ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించాడు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేటా చిత్ర ట్రైలర్‌ని వీక్షించిన వర్మ .. రజనీకాంత్‌ని ఆకాశానికి ఎత్తేశాడు. ‘ఒకేఒక్క సూపర్‌స్టార్ రజినీ.. ఆయన 20 ఏళ్లు చిన్నవాడిలా, 30 రెట్లు ఉత్సాహంగా కనిపిస్తున్నారు’ అంటూ ట్రైలర్‌ని షేర్ చేస్తూ కామెంట్ పెట్టాడు. తమ అభిమాన హీరోని వర్మ ఈ విధంగా పొగిడేసరికి రజనీకాంత్ అభిమానులు పండుగ చేసుకోవడమే కాదు ఆ ట్వీట్‌పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ‘పేటా’ రూపొందిన సంగతి తెలిసిందే. చిత్రంలో రజినీ సరసన సిమ్రన్, త్రిష హీరోయిన్లుగా నటించారు. సన్ టీవీ నెట్‌వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు . విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శశికుమార్, బాబీ సింహ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here