ఘట్కేసర్ మండలం నారపల్లిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ తొలిసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో నారపల్లిలో టీఆర్ఎస్ జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వంగపల్లిలో కేటీఆర్ కు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఘన స్వాగతం పలికారు. అనంతరం కేటీఆర్ వెంట పార్టీ కార్యకర్తలు వరంగల్ కు బయల్దేరారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments