తెలుగు .. తమిళ భాషల్లో లారెన్స్ కి మంచి క్రేజ్ వుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ .. ‘కాంచన 2’ సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలు రెండు భాషల్లోను భారీ వసూళ్లను రాబట్టాయి. ఈ సినిమాలు టీవీలో ప్రసారమైన ప్రతిసారి మంచి రేటింగ్స్ ను రాబడుతున్నాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ ‘కాంచన 3’కి ప్లాన్ చేశాడు.
సన్ పిక్చర్స్ వారితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో లారెన్స్ సరసన కథనాయికలుగా ఓవియా .. వేదిక నటిస్తున్నారు. ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ ‘పెట్టా’ సినిమా ఇంటర్వెల్ సమయంలో ‘కాంచన 3’ మోషన్ పోస్టర్ ప్రదర్శనమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి లారెన్స్ మరోమారు భయపెట్టడానికి రెడీ అవుతున్నాడన్న మాట.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments