కూకట్ పల్లిలో నందమూరి సుహాసినిని చంద్రబాబు ఎన్నికల బరిలో నిలబెట్టినప్పుడు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఆమె వెనకాల నిలబడతారనుకున్నారు. బాలకృష్ణ, చంద్రబాబు సుహాసిని కోసం ప్రచారం చేశారు. అయితే కూకట్ పల్లి బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని.. అందుకే సుహాసినిని నిలిబెట్టారు గనక అక్కడికి నువ్వు ప్రచారానికి వెళ్లొద్దని కేటీఆర్ స్నేహితుడు ఎన్టీఆర్ కి చెప్పాడని ప్రవచారం జరిగింది. ప్రచారానికి వెళితే ఇమేజ్ పోతుంది… అందుకే వెళ్లకుండా సైలెంట్ గా ఉండమనే సరికి ఎన్టీఆర్ సైలెంట్ అయ్యాడని అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, కేటీఆర్ లు ఫ్రెండ్స్ అనే ప్రూఫ్ ఒకటి బయటికొచ్చింది. కేటీఆర్, ఎన్టీఆర్ ఇతర స్నేహితులతో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి నిజంగానే కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తూ సుహాసి తరపున ప్రచారం చేయలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments