కేసీఆర్ తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. కేసీఆర్.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగలే కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. కార్యకర్తలే టీఆర్ఎస్కు ఆయువుపట్టు అని చెప్పుకొచ్చారు. కార్యకర్తలకు అండగా నిలబడటమే తన ఏకైక కర్తవ్యమని పేర్కొన్నారు.
మోదీ, రాహుల్, చంద్రబాబు ఎంత తిరిగినా ప్రజలు నమ్మరని చెప్పారు. దేశం మొత్తానికే కేసీఆర్ నాయకత్వం దిక్సూచిగా మారిందని వివరించారు. దేవాదుల ద్వారా జనగామ జిల్లాలోని ప్రతి చెరువుని నింపుతామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు.