దేశ వ్యాప్తంగా బ్యాంకులు రేపట్నుంచి ఐదు రోజుల పాటు స్తంభించనున్నాయి. బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో.. ఖాతాదారులు ఐదు రోజులు కష్టాలు పడక తప్పదు. డిసెంబర్ 21న ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్(ఏఐబీవోసీ) బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చింది. 22న నాలుగో శనివారం, 23న ఆదివారం కావడంతో బ్యాంకులు పని చేయవు. ఇక 24న(సోమవారం) మళ్లీ బ్యాంకులు తెరుచుకోనున్నాయి. 25న క్రిస్మస్ కావడంతో మళ్లీ బ్యాంకులకు సెలవు. 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ సమ్మెకు పిలుపునిచ్చింది. వేతన సవరణతో పాటు పలు డిమాండ్ల సాధనం కోసం బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. 21న సమ్మె తలపెట్టినప్పటికీ ఏటీఎంలు యథావిధిగా పని చేస్తాయి. అయితే డిసెంబర్ 26న తలపెట్టిన సమ్మె కారణంగా ఏటీఎం సేవలపై ప్రభావం పడనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments