టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలోని రౌండ్ టేబుల్ స్కూల్ నుంచి భారీ ర్యాలీగా తెలంగాణభవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్ పూలమాల వేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాంబర్లోకి చేరుకున్న కేటీఆర్.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, హరీష్‌రావు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ బాధ్యతల స్వీకరణ
Subscribe
Login
0 Comments