తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో క్యాడర్ అధైర్యపడొద్దని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మండల, జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఇవాళ కారు జోరు ఉండొచ్చని…రేపు రిపేర్ కావొచ్చని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్కు బీజేపీ తోకపార్టీ అని విమర్శించారు. 105 మంది బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ రాలేదని…ఇక బీజేపీ కార్యాలయానికి తాళం వేసుకోవాలని ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓ స్టాండ్ అంటూ లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెరాస పై పొన్నం కామెంట్
Subscribe
Login
0 Comments