తెలంగాణ ప్రజలకు టిఆర్‌ఎస్‌ రక్షణ కవచంలా నిలిచిందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ చెప్పారు. చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలని ఆయన అన్నారు. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కెటిఆర్‌ మాట్లాడుతూ 2 కోట్ల మలంది ఓటింగ్‌లో పాల్గొంటే 98 లక్షల మంది టిఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించారని అన్నారు. ఈ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు తమకు ఓట్ల శాతంలో తేడా ఉందని ఆయన చెప్పారు. తాను ముందుగానే చెప్పినట్లు బిజెపి 100 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని ఆయన అన్నారు. బిజెపి అగ్రనేతలంతా వచ్చి ప్రచారం చేసినా ఆ పార్టీ ఘోర పరాజయం పాలైందన్నారు. ఉత్తమ్‌ చెప్పినట్లు నిశ్శబ్ద విప్లవం లేదని, ఉన్నది శబ్ద విప్లమవమేనని ఆయన అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments