టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ నియమితులైన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు, లగడపాటి సర్వే, సీఎం చంద్రబాబు.. ఇలా పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు. అనంతరం మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు.

జాతీయ స్థాయి రాజకీయాలను హైదరాబాద్‌ నుంచి ఎలా శాసిస్తారు? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఇందుకు కేటీఆర్ చాలా సింపుల్‌గా సమాధానమిచ్చారు. ” జాతీయ రాజకీయాలను హైదరాబాద్ నుంచి కూడా శాసించవచ్చు. గతంలో ఎన్టీఆర్ దేశ, రాష్ట్ర రాజకీయాలను ఏకకాలంలోనే శాసించారు. కేసీఆర్ నాయకత్వం మరో 15 ఏళ్లపాటు అవసరం ఉంది. మేం ‘భారతదేశం’ కోసం పనిచేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ‘తెలుగుదేశం’ కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాలను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తారు.

అవకాశవాద పొత్తులు కాకుండా ఓ గుణాత్మక మార్పుకోసం ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసంర ఉంది” అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాడు ఎన్టీఆర్ కూడా హైదరాబాద్‌ నుంచే జాతీయస్థాయిలో రాజకీయాలను శాసించారని.. తాము ఇక్కడ్నుంచే దేశ రాజకీయాలను శాసిస్తామన్నట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో మాట్లాడిన ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments